Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీజిత్‌కి సాయంగా సంగీత ద‌ర్శ‌కుడు గోపీ సుంద‌ర్‌... స‌హాయార్థంగా వీడియో సాంగ్‌!

  • పోలీసుల క‌స్ట‌డీలో మ‌ర‌ణించిన శ్రీజిత్‌ సోద‌రుడు శ్రీజీవ్
  • అందుకు బాధ్య‌త వ‌హించాలంటూ 770 రోజులుగా నిర‌స‌న‌
  • సోష‌ల్ మీడియా మ‌ద్ద‌తుతో ఊపందుకుంటున్న నిర‌స‌న గ‌ళం
కేర‌ళ‌లో శ్రీజిత్ నిర‌స‌న గ‌ళానికి సోష‌ల్ మీడియా తోడైంది. దొంగతనం కేసులో అరెస్టయి పోలీసు క‌స్ట‌డీలో ఉన్న‌పుడు సోద‌రుడు శ్రీజీవ్ మృతి చెంద‌డంపై పోలీసులు బాధ్య‌త వ‌హించాలంటూ 770 రోజులుగా సెక్ర‌టేరియ‌ట్ బ‌య‌ట కూర్చుని నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న శ్రీజిత్‌కి పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. కేర‌ళ‌లో ఎక్క‌డ చూసినా అత‌ని పోస్ట‌ర్లు, ప్ల‌కార్డులే క‌నిపిస్తున్నాయి. ఈ సంద‌ర్భంగా త‌న వంతు సాయంగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ ఓ వీడియో సాంగ్‌ని విడుద‌ల చేశాడు.

'జ‌స్టిస్ ఫ‌ర్ శ్రీజిత్‌' పేరుతో విడుద‌ల చేసిన ఈ పాట ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌న్నింటినీ శ్రీజిత్‌కి ఇవ్వ‌నున్న‌ట్లు గోపీ ప్ర‌క‌టించారు. దీంతో ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 'మీ ఒక్క క్లిక్‌తో చాలా మార్పు తీసుకురావ‌చ్చు' అంటూ ఈ వీడియోను గోపీ సుంద‌ర్ పోస్ట్ చేశారు.

sreejith
sreejeev
gopi sunder

More Telugu News